Tirupati: తిరుమలలో ఐఆర్సీటీసీ కోటా... రైల్లో వెళితే సులువుగా దర్శనం!

Special Quota for Train Travelers to Tirupati in Tirumala
  • తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి టూర్ మొదలు
  • రూ. 990తో తిరుమల, తిరుచానూరు దర్శనం
  • ఏసీ వాహనాల్లో ప్రయాణం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలని భావించే భక్తులు, రైల్లో తిరుపతికి చేరుకుంటే, ఒక్క రోజులోనే స్వామివారి దర్శనంతో పాటు, తిరుచానూరు అమ్మవారి దర్శనాన్ని కూడా కల్పించేలా రూ. 990 ధరలో టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది.

ఉదయం 8 లోగా తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న భక్తులకు మాత్రమే ఈ ప్యాకేజీ. ఇందులో భాగంగా ఏసీ వాహనంలో తిరుమలకు తీసుకుని వెళ్లి, ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. ఇది మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తవుతుంది. రద్దీని బట్టి ఈ సమయం మారవచ్చు. ఆపై సొంత ఖర్చుతో భోజనం అనంతరం యాత్రికులను తిరుచానూరు తీసుకుని వెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించి, తిరిగి రైల్వే స్టేషన్ కు చేరుస్తారు. ఇది ఒక రోజు ప్యాకేజీ అని, వసతి సౌకర్యాలు ఉండవని అధికారులు తెలిపారు.
Tirupati
Tirumala
IRCTC
Darshan

More Telugu News