Maganti Babu: టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత

Maganti Babu son Ramji died in Hospital
  • మూడు రోజులుగా విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స
  • బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేశ్, రోహిత్
విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) పెద్ద కుమారుడు రాంజీ (37) గత అర్ధ రాత్రి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్న ఆయనకు మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాంజీ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే రాంజీ, పార్టీ వ్యవహరాల్లో తండ్రికి సాయంగా ఉండేవారు. రాంజీ మృతి విషయం తెలిసి టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ నటుడు నారా రోహిత్, మాజీ మంత్రి నారా లోకేశ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Maganti Babu
Ramji
Passes Away
Vijayawada
TDP

More Telugu News