కబడ్డీ... కబడ్డీ... అంటూ రోజా సందడి... వీడియో ఇదిగో!

07-03-2021 Sun 22:26
  • చిత్తూరు జిల్లా నిండ్రలో కబడ్డీ టోర్నీ ప్రారంభించిన రోజా
  • కోర్టులో దిగి ఉత్సాహంగా ఆడిన వైనం
  • అందరిలోనూ హుషారు నింపిన రోజా
  • తనకు కబడ్డీ అంటే ఇష్టమన్న రోజా
Roja plays Kabaddi in Chittoor district

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా నిండ్రలో కబడ్డీ టోర్నీ ప్రారంభించిన ఆమె ఎంతో ఉత్సాహంగా ఆడారు. కబడ్డీ కోర్టులో ఉత్సాహంగా కదిలిన రోజాను ఆటగాళ్లు, ప్రేక్షకులు విస్మయంతో తిలరించారు. చీరలో ఉన్నప్పటికీ ఆమె గ్రామీణ క్రీడల పట్ల తన మక్కువను చాటుతూ ఎంతో హుషారుగా కబడ్డీ ఆడారు. దీనిపై రోజా స్పందిస్తూ, తనకిష్టమైన ఆట కబడ్డీ అని తెలిపారు.