రెండో పెళ్లి అంటూ వస్తున్న కథనాలపై మంచు మనోజ్ స్పందన

07-03-2021 Sun 14:19
  • మనోజ్ మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడంటూ ప్రచారం
  • పెళ్లి తేదీ, సమయం కూడా మీరే చెప్పేయండన్న మనోజ్
  • పెళ్లి వార్తల్లో నిజంలేదని పరోక్షంగా చెప్పిన హీరో
  • 2015లో ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహం
  • 2019లో విడాకులు మంజూరు
Manchu Manoj responds to media stories about second marriage

టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అమ్మాయి మోహన్ బాబు బంధువుల కుటుంబానికి చెందినదేనంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మంచు మనోజ్ స్పందించారు. పెళ్లి తేదీ, ముహూర్త ఘడియలు కూడా మీరే చెప్పేయండి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పకనే చెప్పారు. మనోజ్ మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడా...? అంటూ ఓ మీడియా సంస్థ కథనంతో పాటు బ్రహ్మానందం ఫొటోలతో ఉన్న మీమ్ ను కూడా పంచుకుంది. దీనిపైనే మనోజ్ స్పందించారు.

మోహన్ బాబు చిన్న కొడుకైన మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లాడారు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రణతి రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండగా, మనోజ్ సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు.