IPL 2021: ఐపీఎల్-2021 పూర్తి షెడ్యూల్ ఇదిగో!

IPL Latest Season full schedule released
  • ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ
  • మే 30న ఫైనల్
  • తొలి మ్యాచ్ లో ముంబయి, బెంగళూరు ఢీ
  • ఫైనల్ కు ఆతిథ్యమివ్వనున్న నరేంద్ర మోదీ స్టేడియం
  • 6 వేదికల్లో మ్యాచ్ ల నిర్వహణ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించిన బీసీసీఐ తాజా సీజన్ ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్ మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

చెన్నైలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లతో పాటు ఫైనల్ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది. ఈ భారీ స్టేడియంలో ఐపీఎల్ పోటీలు జరగడం ఇదే తొలిసారి.

కాగా, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 6 వేదికల్లోనే మ్యాచ్ లు నిర్వహించనున్నారు. చెన్నై, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా, లీగ్ దశ పోటీలకు ప్రేక్షకులను అనుమతించరాదని నిర్ణయించుకున్నారు. ప్లే ఆఫ్ దశ నుంచి మైదానాలకు ప్రేక్షకులను అనుమతిస్తారని తెలుస్తోంది.
IPL 2021
Schedule
14th Season
India
BCCI

More Telugu News