అమెరికాలో కన్నుమూసిన మ్యూజిక్ లెజెండ్ భాస్కర్ మీనన్!

07-03-2021 Sun 06:57
  • బెవర్లీ హిల్స్ లో కన్నుమూత
  • ఈఎంఐ మ్యూజిక్ సంస్థను స్థాపించిన మీనన్
  • ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్ గానూ సేవలు
Music Legend Bhasker Meenon Died in US

సంగీత దిగ్గజంగా పేరున్న భాస్కర్ మీనన్, అమెరికాలోని బెవర్లీ హిల్స్ లో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఈఎంఐ మ్యూజిక్ సంస్థను స్థాపించిన ఆయన, ప్రపంచ దిగ్గజ కళాకారులైన రోలింగ్ స్టోన్స్, బీట్ లెస్, డేవిడ్ బౌనీ తదితర బృందాలతో పనిచేశారు.

2005 నుంచి 2016 వరకూ ఎన్డీటీవీ బోర్డు డైరెక్టర్ గానూ కొనసాగారు. తిరువనంతపురంలో జన్మించిన ఆయన, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. ఆయనకు భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. మీనన్ మృతికి పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.