Corona: కొవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న వ్యక్తికి సోకిన కరోనా!

Corona Positive After taking Second Dose of Vaccine
  • గుజరాత్ ఆరోగ్య అధికారికి టీకా
  • స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు
  • యాంటీ బాడీలు పెరిగేందుకు సమయం పడుతుందన్న అధికారులు
కరోనా టీకా రెండో డోస్ ను తీసుకున్న ఓ ఆరోగ్య అధికారికి మహమ్మారి సోకడం గుజరాత్ లో కలకలం రేపింది. సదరు వ్యక్తి రెండో డోస్ తీసుకున్న రోజుల వ్యవధిలోనే వైరస్ బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. గాంధీనగర్, దేగం తాలూకా ప్రాంతానికి చెందిన ఆయనకు జనవరి 16న, ఫిబ్రవరి 15న వ్యాక్సిన్ రెండు డోస్ లు ఇచ్చామని, ఆపై ఆయనకు జ్వరం వచ్చిందని, నమూనాలు సేకరించి పరీక్షించగా, వైరస్ పాజిటివ్ వచ్చిందని చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంహెచ్ సోలంకి వెల్లడించారు.

ఆయనలో కరోనా లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన్ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని, తనకు ఆరోగ్యం మెరుగైన వెంటనే విధుల్లో చేరతానని తెలిపారని సోలంకి పేర్కొన్నారు. టీకా తీసుకున్న 45 రోజుల తరువాతనే శరీరంలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతాయని, కొంతమందిలో మాత్రం యాంటీ బాడీల వృద్ధి మరింత ఆలస్యం కావచ్చని అన్నారు. టీకా తీసుకున్న తరువాత కూడా మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Corona
Second Dose
Virus
Gujarath

More Telugu News