'శాకుంతలం'లో దుష్యంతుడిగా మలయాళ నటుడు!

06-03-2021 Sat 21:15
  • గుణశేఖర్ తాజా చిత్రం 'శాకుంతలం'
  • శకుంతల పాత్రలో అందాల సమంత 
  • దుష్యంతుడిగా దేవ్ మోహన్  
  • ప్రస్తుతం భారీ సెట్స్ నిర్మాణం  
Dev Mohan to play Dushyantha in Shakuntalam

ఆమధ్య 'రుద్రమదేవి' వంటి భారీ చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంగా పురాణగాథను ఎంచుకున్నారు. 'శాకుంతలం' పేరిట శకుంతల, దుష్యంతుల ప్రణయగాథను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కావ్యనాయిక శకుంతలగా అందాలతార సమంతను ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఇందులో మరో ముఖ్య పాత్ర అయిన దుష్యంతుడి పాత్ర గురించి ఇటీవలి కాలంలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో, తాజాగా ఈ దుష్యంతుడి పాత్రకు మలయాళ యువ నటుడు దేవ్ మోహన్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

దీనిని పేర్కొంటూ హీరోయిన్ సమంత ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం భారీ సెట్స్ ను వేస్తున్నారు. త్వరలోనే చిత్రం షూటింగును ప్రారంభిస్తారు.