SEC: వలంటీర్లపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చిన ఎస్ఈసీ

SEC establish toll free number to complaint on volunteers
  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • వలంటీర్లపై భారీగా ఫిర్యాదులు
  • ఇప్పటికే జిల్లాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు
  • తాజాగా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
  • ఫిర్యాదుల కోసం ఈమెయిల్ ఐడీ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్లపై ఫిర్యాదులు ఎక్కువ అవుతుండడం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. వలంటీర్లపై ప్రజల నుంచే కాకుండా, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎన్నికల కోడ్ కు వ్యతిరేకంగా ఎవరు వ్యహరించినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లోనూ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో కాల్ సెంటర్లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపింది. తాజాగా వలంటీర్ల వ్యవహారశైలిపై ఫిర్యాదుల కోసం రాష్ట్రస్థాయి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కాల్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫిర్యాదుల కోసం 0866 2466877 టోల్ ఫ్రీ నెంబరును వెల్లడించింది. ఫిర్యాదులపై వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

అంతేగాకుండా, వలంటీర్లపై ఫిర్యాదుల కోసం [email protected] అనే మెయిల్ ఐడీని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది.
SEC
Toll Free Number
Volunteers
Call Center
Municipal Elections
Andhra Pradesh

More Telugu News