ఢిల్లీ పెద్దల పాదపూజ రాష్ట్రం కోసం కాదు, కేసుల మాఫీ కోసం అని తేలిపోయింది: సీఎం జగన్ పై నారా లోకేశ్ వ్యాఖ్యలు

05-03-2021 Fri 20:56
  • జాతీయ మీడియా చానల్లో సీఎం జగన్ పై వార్తలు
  • కష్టాల్లో జగన్ అంటూ కథనాలు
  • ఘాటుగా స్పందించిన లోకేశ్
  • త్వరలోనే జగన్ కు ఆయన ముఠాకు చిప్పకూడు తప్పదని వెల్లడి
  • ఈసారి ఏకంగా విదేశీయులే ఫిర్యాదు చేశారన్న లోకేశ్
Nara Lokesh comments on CM Jagan Delhi visit

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ.... ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదని, కేసుల మాఫీ కోసమన్న విషయం తేలిపోయిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే జగన్ కు, ఆయన బందిపోటు ముఠాకు మరోసారి చిప్పకూడు ఖాయమని స్పష్టమవుతోందని లోకేశ్ అన్నారు. ఈసారి ఏకంగా విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేశారని, ఇక చంచల్ గూడ జైలు కాదు విదేశీ జైలేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం జగన్, ఇతర వైసీపీ నేతలపై జాతీయ మీడియా చానల్లో ప్రసారమైన క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.