కోహ్లీ డక్కౌట్, 17 పరుగులకే పుజారా పెవిలియన్ కు... కష్టాల్లో టీమిండియా!

05-03-2021 Fri 10:44
  • నేడు రెండో రోజు సాగుతున్న ఆట
  • టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఇబ్బందులు
  • ప్రస్తుతం భారత స్కోరు 41/3
India in Trouble after Kohli Duckout

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా కష్టాల్లో పడింది. స్కోరు బోర్డుపై 50 పరుగులు కూడా చేరకుండానే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది.

ఈ ఉదయం రెండో రోజు ఆట ప్రారంభించిన తరువాత, నిలదొక్కుకునేందుకు రోహిత్ శర్మ, పుజారా ప్రయత్నించారు. అయితే, లీచ్ వేసిన ఓ అధ్భుతమైన బంతికి పుజారా డక్కౌట్ కాగా, ఆపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరుగులేమీ చేయకుండానే బెన్ స్టోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.

దీంతో 41 పరుగులకే భారత జట్టు మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 21 పరుగులతో క్రీజులో ఉండగా, అతనికి అజింక్య రహానే వచ్చి జత కలిశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 205 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.