మునిసిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు: ఎస్ఈసీ నిమ్మగడ్డ
- ప్రత్యేకంగా దృష్టి సారించాం
- ఐటీశాఖతోనూ మాట్లాడాం
- ప్రత్యేక బృందాల ఏర్పాటు
- చెక్‌పోస్టుల్లో తనిఖీలు
డబ్బుతో పాటు మద్యం పంపిణీని కట్టడి చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. డబ్బు ప్రభావాన్ని తప్పకుండా నియంత్రిస్తామని, ప్రలోభాలపై దృష్టి సారించామని అన్నారు. ఇందుకు గానూ రవాణాపై మరింత నిఘా ఉంచుతున్నామని తెలిపారు.
మునిసిపల్ ఎన్నికలు జరుగుతోన్న ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు కూడా ఆయా అంశాలను పరిశీలిస్తాయని, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని వివరించారు.