Basara: దేవాన్ష్, ఆర్యవీర్ లకు అక్షరాభ్యాసం... బాసరలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీలు!

Aksharabhyasam for Devansh and Arya veer
  • ఈ ఉదయం అక్షరాభ్యాసం
  • పండితుల సమక్షంలో జరిగిన కార్యక్రమం
  • బందోబస్తును ఏర్పాటు చేసిన స్థానిక పోలీసులు
తెలంగాణలో సరస్వతీదేవి  కొలువైన పుణ్యక్షేత్రం బాసరలో నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ కుటుంబాలు ఈ ఉదయం సందడి చేశాయి. ఇరు కుటుంబాల వంశాంకురాలు దేవాన్ష్, ఆర్యవీర్ ల అక్షరాభ్యాసం ఈ ఉదయం బాసరలో వైభవంగా జరిగింది. ఒకవైపు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ, విశాఖపట్నం ఉక్కు విషయంలో పోరాటానికి సిద్ధమైన చంద్రబాబు నాయుడు, ఈ ఉదయం తమ అన్ని పనులనూ పక్కనబెట్టి, బాసరకు వచ్చారు.

బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ దంపతుల కుమారుడు దేవాన్ష్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆర్యవీర్ బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కుమారుడు. 2018లో జన్మించిన ఆర్యవీర్ కు ప్రస్తుతం మూడేళ్ల వయసుంది.

ఇక పండితుల సమక్షంలో పిల్లలకు బ్రాహ్మణి, వసుంధరలు దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కూడా పాల్గొన్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపించాడు. ఇక తమ అభిమాన నటుడి ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకున్న నందమూరి అభిమానులు ఆలయానికి పోటెత్తారు. మోక్షజ్ఞతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. స్థానిక పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Basara
Balakrishna
Chandrababu
Devansh
Aksharabhyasam

More Telugu News