Chandrababu: విశాఖలో నేడు, రేపు పర్యటించనున్న చంద్రబాబు

TDP Chief Chandrababu Visits Visakha today
  • మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు
  • వివిధ ప్రాంతాల్లో రోడ్డు షో
  • నిన్న ప్రచారంలో పాల్గొన్న లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు, రేపు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం విశాఖ బయలుదేరనున్న చంద్రబాబు మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల తరపున నేడు, రేపు ప్రచారం చేస్తారు. పెందుర్తి, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలలో రోడ్‌ షోలోనూ పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

కాగా, టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నిన్న భీమిలి గంట స్తంభం సెంటర్ నుంచి రోడ్డు షో నిర్వహించారు. లోకేశ్ రోడ్డు షోకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి.
Chandrababu
TDP
Andhra Pradesh
Visakhapatnam

More Telugu News