Sajjala Ramakrishna Reddy: ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు మా పార్టీలో కనిపించవు: సజ్జల

Sajjala praises YCP culture in comparison with other parties
  • నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
  • శుభాకాంక్షలు తెలిపిన సజ్జల
  • కష్టపడేవాళ్లకు గుర్తింపు ఉంటుందని వెల్లడి
  • ఇతర పార్టీలకు వైసీపీ ఎంతో భిన్నమని వ్యాఖ్యలు
  • జగన్ సత్తాకు అది నిదర్శనమని ఉద్ఘాటన
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బరిలో దిగుతున్న ఆరుగురు అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారాలు అందుకుని నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, వైసీపీలో కష్టపడినవారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు.

పార్టీ కోసం ముందు నుంచి నిలబడినవారికి గుర్తింపునివ్వడం వల్ల ఇప్పటివరకు పార్టీలో ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. ఇతర పార్టీల్లో ఉండే అసంతృప్తులు, ఊహాగానాలు వైసీపీలో కనిపించకపోవడానికి ఇదే కారణమని వివరించారు. ఇతర పార్టీల సంస్కృతికి, వైసీపీ  రాజకీయ సంస్కృతికి ఎంతో వ్యత్యాసం ఉందని సజ్జల స్పష్టం చేశారు. జగన్ నాయకత్వ సత్తాకు, సామాజిక సమ న్యాయం అందించేందుకు ఆయన చూపించే శ్రద్ధకు అది కొలమానం అని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి అన్యాయం జరగదన్న నమ్మకం వైసీపీ కార్యకర్తల్లో ఉందని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Culture
Political Parties
Jagan
Andhra Pradesh

More Telugu News