"నా కనులు ఎపుడూ కననే కనని"... రంగ్ దే నుంచి మూడో పాట రిలీజ్ చేసిన మహేశ్ బాబు

04-03-2021 Thu 17:09
  • నితిన్, కీర్తి సురేశ్ జంటగా రంగ్ దే
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో చిత్రం
  • దేవి శ్రీప్రసాద్ సంగీతం
  • తాజా పాటకు సాహిత్యం అందించిన శ్రీమణి
  • దేవి సంగీతంలో తొలిసారి ఆలపించిన సిద్ శ్రీరామ్
Mahesh Babu releases third song from Rang De movie

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.

 నా కనులు ఎపుడూ కననే కనని... అంటూ ఈ సాగే గీతానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ హృద్యంగా ఆలపించారు. దేవి సంగీత దర్శకత్వంలో సిద్ శ్రీరామ్ పాడిన మొదటి పాట ఇదే.

ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న మహేశ్ బాబు.... రాక్ స్టార్ డీఎస్పీ, సిద్ శ్రీరామ్ ఎల్లప్పుడూ ఉర్రూతలూగిస్తుంటారు అని వ్యాఖ్యానించారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.