తమిళనాడులో తాజా షెడ్యూలు పూర్తిచేసిన 'పుష్ప'

04-03-2021 Thu 13:13
  • అల్లు అర్జున్, రష్మిక జంటగా 'పుష్ప' 
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ
  • తెన్ కాశీలో ముగిసిన తాజా షెడ్యూలు
  • సీన్స్, పాట, యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
Pushpa latest schedule shoot completed

'అల వైకుంఠపురములో' విజయం తర్వాత అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ రష్మిక నాయికగా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో చిత్రం షూటింగులో ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో తాజా షెడ్యూలు షూటింగును తమిళనాడులోని తెన్ కాశీ పరిసరాలలో నిర్వహించారు. తాజాగా ఈ షెడ్యూలు పూర్తవడంతో చిత్రం యూనిట్ అక్కడి నుంచి బయలుదేరింది. ఈ షెడ్యూలులో కీలక సన్నివేశాలు,యాక్షన్ ఎపిసోడ్, ఓ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక గ్రామీణ యువతి పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేస్తారు.