Gorantla Butchaiah Chowdary: రేపటి బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలి: టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ‌

gorantla slams ycp
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణను నిరసిస్తూ బంద్‌
  • ఎందరో త్యాగ ఫలం విశాఖ ఉక్కు
  • నేడు అన్యాక్రాంతం చేసే చర్యకి పూనుకోవడం దుర్మార్గపు చర్య
  •  బంద్ కి మద్దతు తెలిపిన బుచ్చయ్య 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా రేపు నిర్వ‌హించ‌నున్న రాష్ట్ర బంద్‌కు వైసీపీ కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌ల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

'రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణను నిరసిస్తూ కార్మికులు తలపెట్టిన బంద్ కి నా మద్దతు తెలుపుతున్నాను. ఎందరో త్యాగ ఫలం విశాఖ ఉక్కు. నేడు అన్యాక్రాంతం చేసే చర్యకి పూనుకోవడం దుర్మార్గపు చర్య. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బంద్ కి మద్దతు తెలపాలి. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు ప్రధానమంత్రి దగ్గరకి తీసుకుని వెళ్లాలి. ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ ఆపాలి' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి డిమాండ్ చేశారు.  

మ‌రోవైపు, 'స‌ర్కారు వారి రేవు పార్టీ' పేరిట 'ఆంధ్ర‌జ్యోతి'లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ వైసీపీ స‌ర్కారుపై గోరంట్ల‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓడరేవుల నిర్మాణంలో ‘రిస్క్‌’ను తగ్గిస్తూ వాటి నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. దీనిపై గోరంట్ల స్పందిస్తూ... 'సర్కారు వారి పాట కాదు.. సర్కారు వారి 'రేవు' పాట పెట్టారు. ఇంకా ఏపీ వంతు మిగిలింది. ఇది కూడా ప్రెవేటీకరణ చేస్తారేమో..!' అని గోరంట్ల విమ‌ర్శించారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Andhra Pradesh

More Telugu News