హెల్మెట్ లేదట.. ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా!

03-03-2021 Wed 17:50
  • రూ. 1,035 చలానా పంపిన అధికారులు
  • ఇది మూడోసారన్న బాధితుడు
  • పదేపదే పంపుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు
Traffic police fine tractor driver for not wearing helmet

హెల్మెట్ లేదని బైకర్‌కు జరిమానా విధించడం సర్వసాధారణమైన విషయం. కానీ హెల్మెట్ ధరించనందుకు ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు చలానా పంపితే.. ఇది వెరైటీ. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిందీ ఘటన. బీర్కూరు మండలం చించొల్లి గ్రామానికి చెందిన సతీష్‌ హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపాడంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.1,035 చలానా పంపారు.

గత నెల 25న మద్దికుంటమర్రి క్రాస్‌రోడ్డులో హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడిపినట్టు అందులో పేర్కొన్నారు. అది చూసిన సతీష్ విస్తుపోయాడు. హెల్మెట్ లేనందుకు చలానా విధించడం ఇది తొలిసారి కాదని, ఇప్పటి వరకు మూడుసార్లు ఇలా చలానా పంపారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు పదేపదే చలానాలు పంపిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సతీష్ వేడుకున్నాడు.