Gone Prakash: పార్టీ పెట్టి వైఎస్ ప్రతిష్ఠను దిగజార్చొద్దు: షర్మిలకు గోనె ప్రకాశ్ హితవు

gone prakash shocking comments on ys sharmila
  • జగన్ లోక్‌సభ సీటు ఇవ్వలేదనే కొత్త పార్టీ
  • చిరంజీవి పార్టీ వల్ల అమాయకులు భూములు అమ్ముకున్నారు
  • షర్మిల కూడా చిరంజీవి బాటలోనే నడుస్తున్నారు
తెలంగాణలో పార్టీ పెట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠను దిగజార్చొద్దని వైఎస్ షర్మిలకు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ హితవు పలికారు. జగన్ ఆమెకు లోక్‌సభ, రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న అక్కసుతోనే షర్మిల పార్టీ పెడుతున్నారని అన్నారు. కుటుంబ కలహాల వల్లే ఆమె పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయన్నారు. గతంలో చిరంజీవి పెట్టిన పార్టీ వల్ల అమాయకులు బలయ్యారని, భూములు అమ్ముకుని నష్టపోయారని అన్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించిన గోనె.. ఇలా పార్టీలు పెట్టి అమాయకులను ముంచొద్దని హితవు పలికారు.
Gone Prakash
YS Sharmila
Telangana
YSR

More Telugu News