Stock Market: కొనసాగిన ర్యాలీ.. భారీ లాభాలలో స్టాక్ మార్కెట్

Stock markets in profits
  • వరుసగా మూడో రోజు లాభాలలో
  • సెన్సెక్స్ 1148 పాయింట్ల లాభం
  • 326 పాయింట్ల లాభంతో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నేడు కూడా భారీ లాభాలను దండుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీచడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై కనిపించింది. దీంతో మన మార్కెట్లు కూడా ఈ రోజు లాభాలలో ఓపెన్ అయ్యాయి. వివిధ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ మొత్తంలో మదుపుచేయడంతో నేటి మార్కెట్లు ఆద్యంతం లాభాలలో పయనించాయి.

ఈ క్రమంలో సెన్సెక్స్ 1148 పాయింట్ల లాభంతో 51445 వద్ద.. నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15245 వద్ద ముగిశాయి. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, గ్రాన్యూల్స్ ఇండియా, బజాజ్ ఫిన్ సెర్వ్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాలను పొందాయి. ఇక ఆల్కమ్ ల్యాబ్, హీరో మోటాకార్ప్, మారుతి సుజుకి, ఎమ్మారెఫ్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.  
Stock Market
Sensex
Nifty
HDFC

More Telugu News