Sathyameva Jayathe: "మన తరపున నిలబడగల నిజం మనిషిరా"... వకీల్ సాబ్ నుంచి 'సత్యమేవ జయతే' గీతం విడుదల

Sathyameva Jayathe song released from Pawan Kalyan Vakeel Saab movies
  • పవన్, శృతి హాసన్ జంటగా వకీల్ సాబ్
  • వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో పాట రిలీజ్
  • తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
  • శ్రీరామ్ వేణు దర్శకత్వంలో సినిమా
  • కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా, అనన్య
  • ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నుంచి మరో గీతం విడుదలైంది. "మన తరఫున నిలబడగల నిజం మనిషిరా.." అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో పంచుకుంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

బాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా... అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కథకు అవసరమైన కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Sathyameva Jayathe
Song
Release
Vakeel Saab
Pawan Kalyan
Tollywood

More Telugu News