Hurun Rich List: ‘హురూన్​’ సంపన్నుల జాబితాలో హైదరాబాదీ ఫార్మా దిగ్గజాల హవా

Seven pharma barons in 10 from Hyderabad in global billionaire club
  • మొత్తంగా 10 మంది హైదరాబాదీలకు జాబితాలో చోటు
  • ఫార్మా దిగ్గజాల సంపద రూ.1,65,900 కోట్లు
  • 54,600 కోట్లతో దివీస్ మురళికి ప్రథమ స్థానం
  • 22,600 కోట్లతో తర్వాతి స్థానంలో అరబిందో రాంప్రసాద్ రెడ్డి
హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కితే.. అందులో ఏడుగురు ఫార్మా దిగ్గజాలే. ఆ ఏడుగురి సంపద రూ.1,65,900 కోట్లు. ప్రపంచ సంపన్నుల జాబితాను మంగళవారం హురూన్ విడుదల చేసింది.

మన దేశానికి సంబంధించి జాబితాలో ముంబై నుంచి 60 మంది కోటీశ్వరులు, ఢిల్లీ నుంచి 40, బెంగళూరు నుంచి 22, అహ్మదాబాద్ నుంచి 11 మంది కోటీశ్వరులు చోటు సంపాదించారు. 10 మంది సంపన్నులతో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జాబితాలో 1,058 మందితో చైనా ముందుంది. మన దేశం నుంచి 209 మంది కోటీశ్వరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కాగా, హైదరాబాద్ కు సంబంధించి రూ.54,100 కోట్ల సంపదతో మురళీ దివి మొదటి స్థానంలో నిలిచారు. దేశంలో ఆయన సంపన్న ర్యాంకు 20 కాగా.. ప్రపంచంలో 385. 22,600 కోట్లతో దేశంలో 56వ స్థానంలో ఉన్న అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్ రెడ్డి.. ప్రపంచ జాబితాలో 1,096వ ర్యాంకును సాధించారు. వారితో పాటు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పి పిచ్చి రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పీవీ కృష్ణారెడ్డిలు జాబితాలో చోటు సంపాదించారు.

జాబితాలో హైదరాబాదీ సంపన్నుల ర్యాంకులు

  • మురళీ దివి: దివీస్ ల్యాబ్స్– రూ.54,100 కోట్లు, దేశంలో ర్యాంకు 20, ప్రపంచ ర్యాంకు 385
  • పీవీ రాంప్రసాద్ రెడ్డి: అరబిందో ఫార్మా– రూ.22,600 కోట్లు, దేశ ర్యాంకు 56, ప్రపంచ ర్యాంకు 1,096
  • బి. పార్థసారథి రెడ్డి: హెటిరో డ్రగ్స్– రూ.16,000 కోట్లు, దేశ ర్యాంకు 83, ప్రపంచ ర్యాంకు 1,609
  • కె. సతీశ్ రెడ్డి: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.12,800 కోట్లు, దేశ ర్యాంకు 108, ప్రపంచ ర్యాంకు 2,050
  • జీవీ ప్రసాద్, జీ అనురాధ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.10,700 కోట్లు, దేశ ర్యాంకు 133, ప్రపంచ ర్యాంకు 2,238
  • పి. పిచ్చిరెడ్డి: మేఘా ఇన్ ఫ్రాస్ట్రక్చర్– రూ.10,600 కోట్లు, దేశ ర్యాంకు 134, ప్రపంచ ర్యాంకు 2,383
  • జూపల్లి రామేశ్వరరావు: మై హోం ఇండస్ట్రీస్– రూ.10,500 కోట్లు, దేశ ర్యాంకు 138, ప్రపంచ ర్యాంకు 2,383
  • పీవీ కృష్ణారెడ్డి: మేఘా ఇంజనీరింగ్– రూ.10,400 కోట్లు, దేశ ర్యాంకు 140, ప్రపంచ ర్యాంకు 2,383
  • ఎం. సత్యనారాయణ రెడ్డి: ఎంఎస్ఎన్ ల్యాబ్స్– రూ.9,800 కోట్లు, దేశ ర్యాంకు 143, ప్రపంచ ర్యాంకు 2,530
  • వీసీ నన్నపనేని: నాట్కో ఫార్మా– రూ.8,600 కోట్లు, దేశ ర్యాంకు 164, ప్రపంచ ర్యాంకు 2,686
Hurun Rich List
Divis Labs
Dr Reddys Laboratories
Hyderabad
Aurobindo Pharma
Natco Pharma
My Home Industries
MEIL
MSN
Hetero

More Telugu News