'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ

02-03-2021 Tue 17:00
  • వర్మ నుంచి మరో అండర్ వరల్డ్ మూవీ
  • ముంబయి మాఫియాపై చిత్రం
  • రేపు ట్రైలర్ రిలీజ్
  • దావూద్ ఇబ్రహీం ప్రస్థానం చూడొచ్చన్న వర్మ
RGV shares D Company motion poster

అండర్ వరల్డ్ కార్యకలాపాలను చిత్ర కథాంశాలుగా మలచడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మది అందె వేసిన చేయి. తాజాగా ఆయన రూపొందిస్తున్న 'డి కంపెనీ' చిత్రం తాలూకు మోషన్ పోస్టర్ ను పంచుకున్నారు. ముంబయి అండర్ వరల్డ్ అంటే ఎలాగుంటుందో తమ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. 80వ దశకంలో దావూద్ ఇబ్రహీం ఎలా ఎదిగాడో 'డి కంపెనీ' చిత్రంలో వివరించామని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నామని వర్మ వెల్లడించారు. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.