Stock Market: స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!

Stock markets close in green
  • వరుసగా రెండో రోజు కూడా లాభాలు 
  • ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల సందడి
  • సెన్సెక్స్ 447 పాయింట్ల లాభం
  • 157 పాయింట్ల లాభంతో నిఫ్టీ 
నిన్న భారీ లాభాలను అందుకున్న మన స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే బాటలో కొనసాగాయి. మదుపరుల కొనుగోళ్ల సందడితో మార్కెట్లు జోష్ చూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50296 వద్ద.. నిఫ్టీ  157 పాయింట్ల లాభంతో 14919 వద్ద క్లోజ్ అయ్యాయి.

ఈ క్రమంలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎం, విప్రో, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభాలను పొందాయి. ఇక ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, టాటా కెమికల్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా తదితర షేర్లు నష్టాలను చవిగొన్నాయి.
Stock Market
Sensex
Nifty
Tata Motors

More Telugu News