కుర్రాడి ప్ర‌తిభ‌కు ఫిదా అయిన సచిన్.. వీడియో ఇదిగో!

02-03-2021 Tue 12:36
  • రూబిక్స్‌ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసిన కుర్రాడు
  • అదీ దాన్ని చూడ‌కుండా సెట్ చేసిన వైనం
  • ఇప్ప‌టికే గిన్నిస్ బుక్‌లోనూ చోటు
sachin praises youngster

ఓ కుర్రాడి టాలెంట్‌కు టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఫిదా అయిపోయారు. క‌ళ్లు మూసుకుని రూబిక్స్‌ క్యూబ్ ను 17 సెకన్లలోనే సెట్ చేసి ఆ కుర్రాడు ఔరా అనిపిస్తున్నాడు. ఆ కుర్రాడిని క‌లిసిన స‌చిన్.. అత‌డు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తుండ‌గా స్వ‌యంగా వీడియో తీసి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ కుర్రాడు ముంబైకి చెందిన టీనేజర్‌ మహ్మద్‌ అమన్‌ కొలీ. గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు.

 అత‌డి గురించి స‌చిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ... త‌న‌తో పాటు ఇక్కడ అమన్‌ కొలి ఉన్నాడని, అత‌డికి రూబిక్స్‌ క్యూబ్ ఇస్తానని చెప్పారు. అతడు దాని వైపు చూడకుండానే దాన్ని సాల్వ్‌ చేస్తాడని తెలిపారు. ఆ కుర్రాడు గిన్నిస్‌ బుక్‌ రికార్డు కూడా సాధించాడని వివ‌రించారు.

ఈ ఇండియ‌న్ మన అందరినీ గర్వపడేలా చేశాడంటూ ప్ర‌శంసించారు. సాధార‌ణంగా మనం క‌ళ్లు తెరిచి చూస్తూ కూడా చేయలేని పనిని అతడు చూడకుండానే చేశాడ‌ని చెప్పారు. ఇప్పుడు అత‌డి ముందు ఓ పెద్ద స‌వాలు ఉంద‌ని,  ఆయ‌న‌ లాగా త‌న‌కు కూడా రూబిక్స్‌ క్యూబ్‌ సాల్వ్‌ చేయడం నేర్పించాల్సి ఉంద‌ని చ‌మ‌త్క‌రించారు.