Ravi Shastri: కరోనా టీకా తీసుకున్న టీమిండియా కోచ్​ రవిశాస్త్రి

  • మొదటి డోస్ వేయించుకున్నానని వెల్లడి
  • దేశాన్ని శాస్త్రవేత్తలు, వైద్యులు శక్తిమంతం చేస్తున్నారని కితాబు
  • కరోనా వ్యాక్సినేషన్ ను అపోలో డాక్టర్ కాంతాబెన్ బాగా చేస్తున్నారని ప్రశంస
Ravi Shastri Gets First Dose Of Covid19 Shot

టీమిండియా కోచ్ రవిశాస్త్రి కరోనా టీకా వేయించుకున్నారు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో మొదటి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. టీకా తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు. కరోనాతో పోరులో వైద్యులు, శాస్త్రవేత్తల ఘనతను కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

‘‘కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నా. మహమ్మారిపై పోరులో భారత్ ను మరింత శక్తిమంతంగా మార్చిన అద్భుతమై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు. అహ్మదాబాద్ అపోలోలోని కాంతాబెన్ ఆమె సిబ్బంది.. కరోనా వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకెళ్తున్న తీరు చాలా చాలా బాగుంది. వారి పనితీరు మెచ్చుకోదగినదిగా ఉంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

More Telugu News