Mohammed Shami: పాపిట సిందూరంతో వున్న ఫొటో పోస్ట్ చేసిన క్రికెట‌ర్ ష‌మీ భార్య‌!

Indian cricketer Mohammed Shamis wife Hasin Jahan posts surprising pic with sindoor
  • షమీతో భార్య‌ హసీన్‌ జహాన్ కు విభేదాలు
  • వేరుగా ఉంటోన్న భార్యాభ‌ర్త‌లు
  • సహనమనే వేలు పట్టుకుని తాను ముందుకు వచ్చానన్న హ‌సీన్
  • తాను ప్రయాణించిన మార్గం ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్య  
టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిపోయిన ఆయ‌న భార్య‌ హసీన్‌ జహాన్‌..‌ కుమార్తెతో కలిసి వేరుగా ఉంటోన్న విష‌యం తెలిసిందే. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసేలా ఆమె తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె చీర కట్టుకుని సిందూరంతో క‌న‌ప‌డింది.

ఈ సంద‌ర్భంగా ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సహనమనే వేలు పట్టుకుని తాను ముందుకు వచ్చానని, తాను ప్రయాణించిన మార్గం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.25 ల‌క్ష‌ల మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఆమె సిందూరం పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.  2012లో తన భర్త సైఫుద్దీన్ నుంచి విడిపోయిన జహాన్, షమీని 2014 ఏప్రిల్ లో రెండో పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత ఆయ‌న‌పై ఆమె ఎన్నో ఆరోప‌ణ‌లు చేసింది. ఇతర మహిళలతోనూ ఆయ‌నకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ష‌మీతో విడిపోయిన ఆమె ఇప్పుడు ఇలా నుదుట సిందూరంతో క‌న‌ప‌డి ప‌లు ఊహాగానాల‌కు తావిస్తోంది.
Mohammed Shami
Cricket

More Telugu News