Corona Virus: దేశంలో ప్రారంభమైన రెండో దశ టీకా పంపిణీ.. తొలి రోజు 25 లక్షల మందికిపైగా పేర్ల నమోదు!

25 lakh people register their names for corona vaccine
  • పేర్లు నమోదు చేయించుకున్న వారిలో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు
  • కొ-విన్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్ ద్వారా పేర్ల నమోదు
  • వ్యాక్సిన్ సెంటర్లలోనూ పేర్ల నమోదుకు అవకాశం
దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు టీకా కోసం కొ-విన్ 2.0 పోర్టల్, ఆరోగ్యసేతు యాప్  ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నిన్నటి నుంచే ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా చేసుకోలేనివారు వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
Corona Virus
Corona vaccine
India
cowin
aarogya setu

More Telugu News