Corona Virus: ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు

Fifty eight corona positive cases  in Andhra Pradesh
  • గత 24 గంటల్లో 20,269 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 11 పాజిటివ్ కేసులు
  • 51 మందికి కరోనా నుంచి విముక్తి
  • ఇంకా 725 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 20,269 కరోనా పరీక్షలు నిర్వహించగా 58 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 10 పాజిటివ్ కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 51 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,080 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 725 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది కరోనాతో మృతి చెందారు.
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Active Cases

More Telugu News