కంటి ఆపరేషన్ చేయించుకున్నా.. టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించొద్దు: అమితాబ్

01-03-2021 Mon 19:33
  • ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవడం సున్నితమైన విషయం
  • నా దృష్టి క్రమంగా మెరుగవుతోంది
  • మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది
Amitabh undergone eye operation

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ ద్వారా ఆయన వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఈ వయసులో ఆపరేషన్ చేయించుకోవడం చాలా సున్నితమైన విషయమని చెప్పారు. ఎంతో జాగ్రత్తగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని అన్నారు.

ఆపరేషన్ సక్సెస్ అయిందని... తనకు వైద్యులు మంచి చికిత్స అందించారని చెప్పారు. తన దృష్టి క్రమంగా మెరుగవుతోందని తెలిపారు. కంటి ఆపరేషన్ వల్ల టైపింగ్ తప్పిదాలు వస్తే మరోలా భావించవద్దని చెప్పారు. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. వికాస్ బెహల్ కొత్త సినిమా సమయానికి కోలుకుంటానని చెప్పారు.