ఏపీలో మరో 117 మందికి కరోనా పాజిటివ్

28-02-2021 Sun 18:32
  • గత 24 గంటల్లో 39,122 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 41 పాజిటివ్ కేసులు
  • మరో 66 మందికి కరోనా నయం
  • ఇంకా 718 మందికి చికిత్స
AP Corona Cases details

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 117 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 41 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు జిల్లాలో17, కృష్ణా జిల్లాలో 11, శ్రీకాకుళం జిల్లాలో 10 కొత్త కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 66 మంది కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 8,89,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,029 మందికి కరోనా నయమైంది. ఇంకా 718 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,169గా నమోదైంది.