పీవీ బతికుంటే వాణీదేవి మాటలకు ఆత్మహత్య చేసుకునేవారు: సీపీఐ నారాయణ
- తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న పీవీ కుమార్తె వాణీదేవి
- పీవీతో కేసీఆర్ ను పోల్చిన వాణీదేవి
- హాస్యాస్పదంగా ఉందన్న నారాయణ
- ఓట్ల కోసం పీవీ పేరు వాడుకుంటున్నారని విమర్శలు
కేసీఆర్ ను వాణీదేవి తన తండ్రి పీవీతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వాణీదేవి మాటలకు పీవీ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పేరుతో ప్రచారం చేస్తే ఓట్లు వేయరనే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని నారాయణ విమర్శించారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్ కాంగ్రెస్ ను కాల్చుతున్నారని అభిప్రాయపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నాగేశ్వర్, జయసారథి గెలుపు ఖాయమని నారాయణ స్పష్టం చేశారు.