Dasoju Sravan: ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ భిక్షగాడు తలసాని: దాసోజు శ్రవణ్

Talasani is a political beggar says Dasoju Sravan
  • ఆకు రౌడీ తలసానితో కేటీఆర్ నన్ను తిట్టించారు
  • 2009లో పార్టీలో చేరమని కేటీఆర్ నా ఇంటికి వచ్చి బతిమాలారు
  • కేటీఆర్ తేలు కుట్టిన దొంగలా పారిపోయారు
తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడితే తాము గొట్టం గాళ్లమా? అని ఫైర్ అయ్యారు.

సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారని... చివరకు తేలు కుట్టిన దొంగలా పారిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన పేరును తోక ముడిచిన తారక రామారావు అని మార్చుకోవాలని అన్నారు. ఆకు రౌడీ అయిన ఆలుగడ్డల శ్రీనివాస్ తో తనను కేటీఆర్ తిట్టించారని... ఇది సరికాదని చెప్పారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తలసాని ఒక రాజకీయ భిక్షగాడు అని శ్రవణ్ దుయ్యబట్టారు. చెంచాగిరి చేసే తలసానికి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. 'ఈ గొట్టంగాని కోసమే 2009లో నా ఇంటికి వచ్చావ్ కేటీఆర్' అని మండిపడ్డారు. తనను బతిమాలి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని కేటీఆర్ అబద్ధాలు చెపుతున్నారని... కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా దిగిపోయే నాటికి 1.30 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. తాను చెప్పేది తప్పని గన్ పార్క్ కు వచ్చి కేటీఆర్ నిరూపించాలని... నిరూపిస్తే అక్కడికక్కడే గొంతు కోసుకుని చచ్చిపోతానని చెప్పారు. మరోవైపు శ్రవణ్ ను బుద్ధిలేని సన్యాసి అని తలసాని అన్నారు. అర్హత లేని వాళ్లు రమ్మంటే కేటీఆర్ వస్తారా? అని ఎద్దేవా చేశారు.
Dasoju Sravan
Congress
KTR
TRS
Talasani

More Telugu News