పలాసలో వైసీపీ నేతలను రబ్బరు చెప్పులతో తరమడం ఖాయం: అచ్చెన్నాయుడు

27-02-2021 Sat 18:51
  • పలాసలో వైసీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయి
  • టీడీపీ అభ్యర్థులను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారు
  • ఏం చేసినా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు
YSRCP will be defeated in Palasa says Atchannaidu

శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ ఆగడాలు శ్రుతిమించుతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించి వారిని పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. టీడీపీ కౌన్సిలర్లను చేర్చుకున్నా వైసీపీకి ఓటమి తప్పదని చెప్పారు.

పలాసలో వైసీపీ నేతలను జనాలు రబ్బరు చెప్పులతో తరమడం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి అరాచకాలకు మున్సిపల్ ఎన్నికలు సమాధానం చెప్పబోతున్నాయని అన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం తమ వంతు వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించాయి.