kanipakam: కాణిపాకం ఆల‌యానికి రూ.7 కోట్ల విరాళ‌మిచ్చిన ప్ర‌వాస భార‌తీయుడు!

  • ఈ రోజు ఉద‌యం చెక్ అంద‌జేత‌
  • త‌న పేరు చెప్పొద్ద‌న్న దాత‌
  • ఆల‌య పున‌ర్నిర్మాణం కోసం విరాళం
nri gives donation for kanipakam temple

ప్రవాస భారతీయడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం భూరి విరాళం ఇచ్చారు. అయితే, త‌న పేరును  చెప్పేందుకు ఆయ‌న అంగీక‌రించ‌లేదు. ఈ రోజు ఉదయం ఆలయ ఈవో ఎ.వెంకటేశ్‌కు ఆయ‌న రూ.7 కోట్ల విరాళం ఇచ్చారు.

ఆ ఆలయ పునర్నిర్మాణ ప‌నుల‌కు మొత్తం రూ.8.75 కోట్ల ఖర్చు అవుతుందని ఇప్ప‌టికే ఇంజ‌నీర్లు అంచనా వేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఓ ప్ర‌వాస భార‌తీయుడు ఆ నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో మొదటి విడతగా ఇవాళ రూ.7 కోట్లు ఇచ్చారని ఈవో వెంక‌టేశ్ తెలిపారు.

ఈ రోజు ఉద‌యం ఆల‌యానికి వ‌చ్చిన‌ దాతతో పాటు ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో  అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసి, దాత కుటుంబ స‌భ్యుల‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

More Telugu News