Star Maa: ప్రెస్ నోట్: స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

100 percent Love guarantees a 100 percent Fun Sundays
 
ప్రెస్ నోట్: ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌ ఉంటే..? అంతకంటే కావాల్సిందేముంటుంది అనే అంటారు అందరూ.
 
స్టార్‌ మా ఈ ఆదివారం అలాంటి ఓ మంచి ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే- గత ఆదివారానికి కొనసాగింపుగా, రెండో భాగంగా అందించబోతోంది '100% లవ్‌.
 
ఈ ఆదివారం (ఫిబ్రవరి 28న) సా 6 గం.లకు ఈ గ్రాండ్‌ గాలా ఈవెంట్‌ స్టార్‌ మా లో ప్రసారం కాబోతోంది. మీరా మేమా అనే రేంజ్‌లో తలపడుతున్న దీల్‌ రియల్‌ కపుల్స్‌లో గెలుపు ఎవరిది అనే అంశం మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థాయిలో పోటీ జరుగుతోంది. ఊహించని సెలబిటీలు రావడం, పోటీలో కొత్త కొత్త పంథాలో జరగడం, ఆటలు, పాటలు కలవడం.. మొత్తం మీద 100% లవ్‌ ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. సీనియర్‌ ప్రజంటర్‌ ఓంకార్‌ ప్రత్యేక ఆకర్షణగా రెండు జంటల మధ్య పోటీని పదునెక్కించారు.
 
ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గం.లనుంచి 8 గం. ల వరకు సుమ చేస్తున్న హంగామా, కామెడీ స్టార్స్‌ అందిస్తున్న సందడి మామూలే. సో.. ఆదివారం క్యాలెండర్‌ సెట్‌ చేసుకోండి.
 
"100% లవ్" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/cbnh46BOifc
 
Press release by: Indian Clicks, LLC
Star Maa

More Telugu News