Shashi Tharoor: పెట్రో ధరలను నిరసిస్తూ ఆటోలకు తాళ్లు కట్టి లాగిన శశి థరూర్

  • దేశంలో మండిపోతున్న చమురు ధరలు
  • నేడు భారత్ బంద్
  • తిరువనంతపురంలో కాంగ్రెస్ నిరసన
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న థరూర్
Shashi Tharoor pulls an auto in the protests against petro prices hike

దేశంలో ఇంధన ధరల పెంపుకు నిరసనగా నేడు భారత్ బంద్ కు వాణిజ్యసంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేరళ రాజధాని తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డుపైకి లాక్కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను థరూర్ పంచుకున్నారు.

చమురు ధరలు తగ్గించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ విఫలమయ్యాయని విమర్శించారు. ఆ విషయాన్ని ఎత్తిచూపేందుకు ఆటోలను తాళ్లతో లాగామని వివరించారు. చమురు ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది ఆటోలు పాల్గొన్నాయని థరూర్ వివరించారు.

More Telugu News