తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

26-02-2021 Fri 15:01
  • 24 గంటల్లో కరోనాతో ఇద్దరి మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టివ్ కేసులు
  • 2,98,453కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
189 new Corona cases in Telangana

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,453కి చేరుకుంది. ఇప్పటి వరకు 1,632 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,94,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.