mohan babu: మరోసారి జతకడుతున్న మోహన్ బాబు, మీనా

Mohan Babu and Meena to pair again
  • పలు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు, మీనా
  • 'సన్ ఆఫ్ ఇండియాలో' నటిస్తున్న మీనా
  • రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం 
ఒకరేమో డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా ఉర్రూతలూగించిన గొప్ప నటుడు. మరొకరేమో బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను మైమరపించిన నటి. వారే మోహన్ బాబు, మీనా. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వీరిద్దరూ కలసి మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలో మీనా నటించబోతున్నారు. ఈ సినిమాకు రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
mohan babu
meena
Tollywood

More Telugu News