అక్కినేని హీరోతో 'ఉప్పెన' దర్శకుడు

25-02-2021 Thu 21:23
  • బుచ్చిబాబు తొలిచిత్రం 'ఉప్పెన' హిట్  
  • నాగ చైతన్యతో తదుపరి సినిమా 
  • బుచ్చిబాబు కథకు ఓకే చెప్పిన చైతు 
Bucchibabu to direct Akkineni Naga Chaitanya

 ప్రేమకథా చిత్రాలలో కొన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. వారిపై బలమైన ముద్ర వేస్తాయి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా ఈమధ్య వచ్చిన 'ఉప్పెన' చిత్రం కూడా అటువంటిదే. వైవిధ్యమైన కథ.. దానిని తెరపై దర్శకుడు ఆవిష్కరించిన వైనం.. ప్రేక్షకులకు బాగా పట్టేశాయి. తొలిచిత్రమైనా దర్శకుడు బుచ్చిబాబు చక్కని ప్రతిభను చాటాడంటూ ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం సాధించిన విజయంతో అతనికి పలు ఆఫర్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా బుచ్చిబాబు ఓ చిత్రానికి కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని అంటున్నారు. బుచ్చిబాబు తాజాగా చైతూకి కథ చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని చెబుతున్నారు. ఈ చిత్రం కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే నిర్మాణం జరుపుకోవచ్చని సమాచారం.