ఏపీలో మునిసిపల్ ఎన్నికలు.. ఇన్‌చార్జ్‌లను నియమించిన బీజేపీ

24-02-2021 Wed 12:14
  • ఏపీలో త్వరలో మునిసిపల్, పరిషత్ ఎన్నికలు
  • సమాయత్తమవుతున్న బీజేపీ
  • ఏపీ మాజీ చీఫ్ కన్నాకు గుంటూరు బాధ్యతలు
BJP Appointed Incharges ahead of municipal polls

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మునిసిపల్, పరిషత్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలను నియమించింది. ఆ పార్టీ నేతలు జీవీఎల్ నరసింహారావు, కె.హరిబాబు, మాధవ్, విష్ణుకుమార్ రాజు, కాశీవిశ్వనాథరాజులకు ఉత్తరాంధ్ర బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది.

ఇక సుజనా చౌదరి, చిన్న రామకోటయ్య, అంబికా కృష్ణలకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల బాధ్యతలను ఇచ్చింది. బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించగా, రావెల కిశోర్‌బాబును ప్రకాశం జిల్లాకు ఇన్‌చార్జ్‌గా నియమించింది. టీజీ వెంకటేశ్, పార్థసారథి, వరదాపురం సూరిలకు అనంతపురం, కర్నూలు జిల్లా బాధ్యతలను అప్పగించింది.