Maharashtra: ఆర్టీపీసీఆర్​ నెగెటివ్​ రిపోర్ట్​ ఉంటేనే.. ఆ ఐదు రాష్ట్రాల వారికి ఢిల్లీలోకి ప్రవేశం!

Delhi To Ask For Covid Report For Arrivals From 5 States
  • మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వారికి రూల్
  • శుక్రవారం నుంచి అమలు చేసే యోచనలో ఢిల్లీ సర్కార్
  • మార్చి 15 వరకు అమలు కానున్న కొత్త నిబంధనలు
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే.. కచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును చూపిస్తేనే అనుమతించేలా నిబంధన పెడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ఢిల్లీ సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 15 దాకా ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉండనున్నట్టు సమాచారం. దీనిపై ఈరోజు సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే వారికి ఈ నిబంధనను అమలు చేయనున్నారు. వారం రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో 86 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రయాణికులు టెస్టు చేయించుకున్న రిపోర్టును ఆయా రాష్ట్రాల అధికారులే పరిశీలించనున్నారు. కాగా, ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇలాంటి ఆంక్షలే విధించాయి.
Maharashtra
New Delhi
Punjab
Madhya Pradesh
Kerala
COVID19

More Telugu News