సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

24-02-2021 Wed 07:42
  • కథ వినకుండా ఓకే చెప్పేసిందట!
  • వచ్చే నెల నుంచి అఖిల్ షూటింగ్
  • 'డీటీఎస్' మొదలెట్టిన సునీల్  
Priya Prakash Warrior about Check movie

*  ఈ నెల 26న విడుదలవుతున్న 'చెక్' చిత్రాన్ని కథ కూడా వినకుండా ఒప్పుకున్నానని చెబుతోంది కథానాయిక ప్రియా ప్రకాశ్ వరియర్. "దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన 'మనమంతా' చిత్రాన్ని మలయాళంలో చూశాను. బాగా నచ్చింది. అందుకే, ఆయన నుంచి చెక్ సినిమాకి ఆఫర్ రాగానే కథ కూడా అడగకుండా ఓకే చెప్పేశాను' అని చెప్పింది ప్రియ.
*  అఖిల్ అక్కినేని హీరోగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆమధ్య వచ్చింది. అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.  
*  ప్రముఖ హాస్య నటుడు సునీల్ హీరోగా 'డీటీఎస్' (డేర్ టు స్లీప్) అనే చిత్రం రూపొందుతోంది. అభిరామ్ పిళ్లా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం పూజ కార్యక్రమాలు నిన్న జరిగాయి. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో కన్నడ నటుడు చేతన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు. డోనాల్, నటాషా హీరోయిన్లుగా నటిస్తారు.