విశాఖ స్టీల్ ప్లాంట్ కు నవరత్న హోదా ఉంది: మోదీకి డి.రాజా లేఖ

23-02-2021 Tue 21:57
  • ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
  • ఇది విశాఖ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం
  • ప్లాంటును పరిరక్షించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు
D Raja writes letter to Modi on Vizag Steel Plant

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం దుమారం రేపుతోంది. ప్లాంటును కాపాడుకునేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారికి వివిధ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి.

 మరోవైపు ఈ అంశంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంటు విశాఖ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ సంస్థకు నవరత్న హోదా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంటును రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని... ఇనుప గనులు కేటాయించలేదని చెప్పారు. సంస్థ నుంచి 100 శాతం పెట్టుబడి ఉపసంహరణకు తాము వ్యతిరేకమని తెలిపారు.