Zahra Ismaili: హంతకురాలు గుండెపోటుతో చనిపోయినా గానీ ఉరిశిక్ష అమలు... ఇరాన్ లో ఘటన

  • భర్తను చంపిన మహిళకు ఇరాన్ లో ఉరి
  • మహిళ కంటే ముందు 16 మందిని ఉరితీసిన అధికారులు
  • ఆ 16 మంది చనిపోవడం కళ్లారా చూసిన మహిళ
  • తీవ్రమైన గుండెపోటుకు గురైన వైనం
Iranian woman was hanged despite she died of heart attack

ఇరాన్ లో ఆసక్తికర ఘటన జరిగింది. భర్తను చంపిన ఓ మహిళకు మరణశిక్ష విధించారు. అయితే ఆమె ఉరితీతకు ముందే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. అయినప్పటికీ ఆమెను నిబంధనల ప్రకారం ఉరితీశారు. జహ్రా ఇస్మాయిలీ అనే మహిళ భర్తను చంపిన నేరానికి జైలుపాలైంది. ఆమె హత్య చేసినట్టు నిరూపితం కావడంతో కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె భర్త ఇరాన్ ఇంటెలిజెన్స్ శాఖలో అధికారి. అయితే తనను, కుమార్తెను దూషిస్తుండడంతో జహ్రా ఇస్మాయిలీ భర్తను అంతమొందించింది.

నేరం నిరూపితం కావడంతో కరాజ్ పట్టణంలోని రజాయ్ షహర్ జైల్లో ఉరికి ఏర్పాట్లు చేశారు. జహ్రా కంటే ముందు 16 మంది దోషులను ఉరితీశారు. వారందరి మరణయాతనను స్వయంగా చూసిన జహ్రా తీవ్రమైన గుండెపోటుకు గురైంది. వైద్యసాయం అందేలోపే ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె అత్త మాత్రం తన కుమారుడ్ని చంపిన కోడలిపై కసితో రగిలిపోయింది. జహ్రా చనిపోయినప్పటికీ ఆమె కూర్చున్న కుర్చీని తన్నేయడంతో ఉరితీత పూర్తయింది.

ఇరాన్ లో ఉరిశిక్ష పడిన దోషుల ఉరితీతలో పాల్గొనేందుకు బాధితుల బంధువులను అనుమతిస్తారు. ఉరికంబం వద్ద దోషులు కూర్చున్న కుర్చీని తన్నేసే హక్కు వారికి లభిస్తుంది. తద్వారా తమకు న్యాయం జరిగిందన్న భావనతో పాటు, తమ చేతులతోనే దోషిని చంపామన్న తృప్తి కూడా లభిస్తుంది.

More Telugu News