బాలకృష్ణ సినిమా షూటింగుకు గ్రామస్థుల అభ్యంతరం!

22-02-2021 Mon 19:43
  • బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • వికారాబాద్ మండలంలో షూటింగ్ ను అడ్డుకున్న స్థానికులు
  • పంట పొలాలు పాడవుతాయని అభ్యంతరం
Villagers intercepted Balakrishna film shooting

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర షూటింగ్ కోసం వికారాబాద్ మండలం కొటాలగూడెంకు చిత్ర యూనిట్ వెళ్లింది. అయితే షూటింగ్ ను స్థానికులు అడ్డుకున్నారు. షూటింగ్ వల్ల పంట పొలాలు నాశనమవుతాయని, అందువల్ల ఇక్కడ షూటింగ్ చేయవద్దని కోరారు. దీంతో, మరో లొకేషన్ వెతికే పనిలో చిత్ర యూనిట్ పడింది.

కాగా, ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే పవర్ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. పలు పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు ఈ టైటిల్ ని నిర్ణయించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కాబోతోంది.