ఓడిపోయే స్థానంలో టికెట్ ఇచ్చి మా చిన్నమ్మను మోసం చేశారు: పీవీ మనవడు సుభాష్

22-02-2021 Mon 17:35
  • తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్
  • కేసీఆర్ నిర్ణయంపై విమర్శలు
  • మహనీయుడి పేరుతో కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న సుభాష్
PV grandson NV Subhash comments on TRS MLC ticket for his aunt Vanidevi

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ స్పందించారు. ఎలాంటి గెలుపు అవకాశాలు లేని స్థానంలో తన చిన్నమ్మ వాణీదేవికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఓడిపోతుందని తెలిసీ టికెట్ ఇవ్వడం మోసం చేయడమేనని విమర్శించారు. ఓ మహనీయుడి పేరు చెప్పుకుని కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని మోసం చేయడమే కాదని, బ్రాహ్మణ సమాజం ఓట్లు చీల్చే ప్రయత్నమని అన్నారు.