అరాచకాన్ని టీడీపీ కట్టడి చేయగ‌లిగింది: వ‌ర్ల రామ‌య్య‌

22-02-2021 Mon 10:27
  • స్థానికసంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకం
  • ఎన్నికల అధికారుల స్వామిభక్తి పారాయణం
  • కొందరు పొలీసు అధికారుల బరితెగింపు
  • అయినా 90 శాతం గ్రామ పంచాయతీల గెలుపు సాధ్యం కాలేదు
varla ramaiah slams govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ నేత‌లు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వారి చ‌ర్య‌లను త‌మ పార్టీ అడ్డుకుని నిల‌బ‌డింద‌ని ఆయ‌న చెప్పారు.

'రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకం, ఎన్నికల అధికారుల స్వామి భక్తి పారాయణం, కొందరు పొలీసు అధికారుల బరితెగింపు కలిపినా అధికార పార్టీకి  90 శాతం గ్రామ పంచాయతీల గెలుపు సాధ్యం కాలేదు. తెలుగుదేశం పోరాటానికి అధికారపార్టీ సాష్టాంగ పడింది. అరాచకాన్ని టీడీపీ కట్టడి చేయగ‌లిగింది' అని వ‌ర్ల రామ‌య్య తెలిపారు.