ఏపీ కరోనా అప్ డేట్: 88 మందికి కరోనా పాజిటివ్

21-02-2021 Sun 17:55
  • గత 24 గంటల్లో 31,680 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 21 కేసులు
  • 72 మందికి కరోనా నయం
  • కరోనా మరణాలు నిల్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 620
Eighty eight corona positive cases in AP

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,680 కరోనా పరీక్షలు నిర్వహించగా 88 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 19, విశాఖ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 72 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,89,298 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 620 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 7,167గా నమోదైంది.